రియా పిటిషన్‌ను సవాల్ చేస్తూ బీహార్ ప్రభుత్వం కేవియట్ పిటిషన్

ABN , First Publish Date - 2020-07-31T03:18:08+05:30 IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో నాటకీయ పరిణామాలు...

రియా పిటిషన్‌ను సవాల్ చేస్తూ బీహార్ ప్రభుత్వం కేవియట్ పిటిషన్

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసు విచారణను బీహార్ నుంచి ముంబైకి బదిలీ చేయాలని రియా చక్రవర్తి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయాన్ని రియా తరపు న్యాయవాది సతీష్ మనీషిండే తెలిపారు. అయితే.. గురువారం ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను సవాల్ చేస్తూ బీహార్ ప్రభుత్వం సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. సుశాంత్ తండ్రి కూడా సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.


ఇదిలా ఉంటే.. బీహార్ పోలీసులు సుశాంత్ ఆత్మహత్య కేసులో విచారణను వేగవంతం చేశారు. సుశాంత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖండె నివాసానికి వెళ్లి ఆమెను విచారించారు. సుశాంత్ అకౌంట్ నుంచి రియా చక్రవర్తి రూ.15 కోట్లు బదిలీ చేసిన వ్యవహారంపై ఆరా తీసేందుకు ముంబైలోని కొటక్ మహీంద్ర బ్యాంకుకు వెళ్లారు.

Updated Date - 2020-07-31T03:18:08+05:30 IST