బిగ్‌బాస్‌ అభిజీత్‌

ABN , First Publish Date - 2020-12-21T08:54:02+05:30 IST

‘స్టార్‌ మా’ రియాలిటీ షో బిగ్‌బాస్‌ నాలుగో అంచె కిరీటం ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ ఫేం అభిజిత్‌ సొంతమైంది. రన్నర్‌పగా అఖిల్‌ నిలిచారు. నాగార్జున వ్యాఖ్యాతగా 106 రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఈ షో ఫినాలే ఆదివారం వీక్షకులను మునివేళ్ల మీద

బిగ్‌బాస్‌ అభిజీత్‌

నాలుగో అంచె విజేతగా ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ ఫేం

25 లక్షల ప్రైజ్‌మనీ.. చిరంజీవి చేతుల మీదుగా అందజేత


‘స్టార్‌ మా’ రియాలిటీ షో బిగ్‌బాస్‌ నాలుగో అంచె కిరీటం ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ ఫేం అభిజిత్‌ సొంతమైంది. రన్నర్‌పగా అఖిల్‌ నిలిచారు. నాగార్జున వ్యాఖ్యాతగా 106 రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఈ షో ఫినాలే ఆదివారం వీక్షకులను మునివేళ్ల మీద నిలబెట్టింది. ఫైనలిస్టులు అభిజిత్‌, సొహైల్‌, అఖిల్‌, హారిక, అరియానా మధ్య గట్టి పోటీ నెలకొనడంతో విజేత  ఎవరన్న ఉత్కంఠ నెలకొంది. వీక్షకుల నుంచి ఆదరణ రూపంలో అత్యధిక ఓట్లు పొందిన అభిజిత్‌ను విజేతగా ప్రకటించారు. హోస్ట్‌ నాగార్జున సమక్షంలో, కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా విచ్చేసిన చిరంజీవి.. విజేత అభిజిత్‌కు ట్రోఫీని, రూ.25లక్షల నగదు బహుమతిని అందించారు. 


మహబూబ్‌కు రూ.10 లక్షలచ్చిన చిరంజీవి 

విజేత ఎంపిక సమయంలో సహజంగా ఉండే నాటకీయత ఈసారీ నెలకొంది. విజేత రేసు నుంచి ఎవరైనా తప్పుకొంటే రూ.25 లక్షలు ఇస్తానని నాగార్జున చెప్పడంతో పోటీదారుల్లో ఉన్న సొహైల్‌ వెంటనే ఓకే చెప్పాడు. తనకు వచ్చే ఆ మొత్తంలో రూ.5 లక్షలను తన స్నేహితుడు మెహబూబ్‌కు, రూ.10 లక్షలను అనాథ శరణాలయానికి ఇస్తానని సొహైల్‌ చెప్పాడు. వెంటనే స్పందించిన మెహబూబ్‌ తనకిస్తానన్న రూ.5 లక్షలు కూడా అనాథ శరణాలయానికి ఇస్తానని ప్రకటించాడు. కాగా అనాథ శరణాలయానికి ఆ రూ.10 లక్షలను తాను సొంతంగా ఇస్తానని నాగార్జున చెప్పడంతో అంతా హర్షం వ్యక్తం చేశారు. సొహైల్‌ ఇస్తానన్న రూ.5లక్షలను అనాథ శరణాలయానికి మెహబూబ్‌ ఇస్తానన్నాడని చిరంజీవికి నాగార్జున  చెప్పడంతో ఆయన స్పందించారు. వెంటనే మెహబూబ్‌కు వేదికపైనే రూ.10 లక్షల చెక్కును చిరు అందించారు.


రేసు నుంచి వైదొలిగితే రూ.10 లక్షలు ఇస్తామని ఆరియానాకు ఆఫర్‌ వచ్చినా చివరిదాకా పోటీలో ఉండేందుకే ఆమె మొగ్గుచూపారు. కాగా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌లో ఒకరైన దివికి తన సినిమాలో ఓ కీలక పాత్ర అవకాశం ఇస్తానని చిరంజీవి మాటిచ్చారు. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ఆయన నటించబోయే ‘వేదాళం’ రీమేక్‌లో దివిని ఓ పోలీస్‌ పాత్ర కోసం తీసుకుంటామని, అందుకు సంబంధించి చర్చ కూడా జరిగిందని చిరంజీవి చెప్పారు. సొహైల్‌ తీయబోయే సినిమాలో గెస్ట్‌ రోల్‌ అయినా చేస్తానని చిరంజీవి చెప్పారు. 

- సినిమా డెస్క్‌

Updated Date - 2020-12-21T08:54:02+05:30 IST