భీష్మ సినిమా టైటిల్‌ను తొలగించాలి

ABN , First Publish Date - 2020-02-18T12:55:12+05:30 IST

భీష్మ సినిమా టైటిల్‌ను తొలగించాలి

భీష్మ సినిమా టైటిల్‌ను తొలగించాలి

బీజేపీ ధార్మిక సెల్‌ నేతల డిమాండ్‌     

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి):  మహాభారతానికి మూల పురుషుడు, ఆ జన్మ బ్రహ్మచర్యం పాటించిన భీష్ముడి పేరుతో సినిమా రూపొందించడంపై బీజేపీ ధార్మిక సెల్‌ నేతలు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు.  భీష్ముడి పేరుతో సినిమా విడుదల చేయడం ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు. సోమవారం హైదర్‌గూడలోని ఎన్‌ఎఎస్‌ఎ్‌సలో ధార్మిక సెల్‌ కన్వీనర్‌ తూములూరి శ్రీకృష్ణచైతన్య శర్మ, ప్రధాన కార్యదర్శి రత్నాకరం రాము, కార్యవర్గ సభ్యులు వంగల రామకృష్ణ, భీమ్‌సేన్‌మూర్తి తదితరులు మాట్లాడారు. భీష్మ సినిమా టైటిల్‌ను వెంటనే మార్చాలని, ఇందులో హీరోను లవర్‌ బాయ్‌గా చూపిస్తూ ఆ పాత్రకు భీష్మ పేరు పెట్టడం బాధాకరమన్నారు. టైటిల్‌ మార్చని పక్షంలో ఈ సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. సినిమా పేరును మార్చకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సైతం వెనుకాడమని ఈ  సందర్భంగా చెప్పారు.  

Updated Date - 2020-02-18T12:55:12+05:30 IST