ఫోర్బ్స్ సంపన్న సెలెబ్రిటీల జాబితాలో.. భారత్ నుంచి ఒకేఒక్కడు!

ABN , First Publish Date - 2020-06-05T23:27:48+05:30 IST

ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్.. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంపాదన ఆర్జిస్తున్న 100మంది సెటెబ్రిటీల జాబితాను విడుదల చేసింది.

ఫోర్బ్స్ సంపన్న సెలెబ్రిటీల జాబితాలో.. భారత్ నుంచి ఒకేఒక్కడు!

ముంబై: ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్.. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంపాదన ఆర్జిస్తున్న 100మంది సెటెబ్రిటీల జాబితాను విడుదల చేసింది.  ఇందులో భారత్ నుంచి ఒకేఒక్క సెలెబ్రిటీ ఈ జాబితాలో చోటు సంపాదించాడు. అతనెవరో కాదు, కరోనాపై పోరాటం చేయడం కోసం భారత ప్రభుత్వానికి రూ.25కోట్లు విరాళం అందించిక అక్షయ్ కుమార్. జూన్, 2019 నుంచి మే, 2020 వరకు అక్షయ్ 48.5 మిలియన్ డాలర్లు(రూ.366కోట్లు) ఆర్జించినట్లు అంచనా. దీంతో ఫోర్బ్స్ 100మంది సంపన్న సెలెబ్రిటీల జాబితాలో అక్షయ్ నిలిచాడు. ఈ లిస్టులో అక్షయ్ 52వ స్థానంలో ఉన్నాడు. దీనిలో తొలి స్థానంలో కైలీ జెన్నర్ ఉన్నాడు. ‘బెల్ బాటమ్’ వంటి చిత్రాల ద్వారా అక్షయ్ దాదాపు రూ.98కోట్లు సంపాదన ఆర్జిస్తున్నాడని ఫోర్బ్స్ తెలిపింది.

Updated Date - 2020-06-05T23:27:48+05:30 IST