కోలీవుడ్ డైరెక్ట‌ర్‌తో యంగ్ టైగర్..!

ABN , First Publish Date - 2020-02-14T23:16:24+05:30 IST

'అరవింద సమేత' చిత్రం తర్వాత 'ఆర్.ఆర్.ఆర్'తో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ బడా మల్టీస్టారర్ నుంచి..

కోలీవుడ్ డైరెక్ట‌ర్‌తో యంగ్ టైగర్..!

'అరవింద సమేత' చిత్రం తర్వాత 'ఆర్.ఆర్.ఆర్'తో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ బడా మల్టీస్టారర్ నుంచి.. మరో మూడు, నాలుగు నెలల్లో ఫ్రీ అవ్వనున్నాడు తారక్. ఇక ఆ తర్వాత.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమాని పట్టాలెక్కించబోతున్నాడనే ప్రచారం ఉంది. కానీ.. త్రివిక్రమ్ కంటే ముందే.. ఎన్టీఆర్ మరో దర్శకుడిని లైన్‌లో పెట్టాడట. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పాటు.. తమిళ దర్శకుడు వెట్రిమారన్‌ని కూడా లైన్‌లో పెట్టాడట తారక్. తమిళంలో వెట్రిమారన్ దర్శకత్వం వహించిన 'పొల్లాదవన్', 'ఆడుకాలమ్', 'విశారణై', 'వడ చెన్నై' చిత్రాలన్నీ విజయాలు సాధించాయి. ఇక.. ఈ సినిమాలతో ఉత్తమ దర్శకుడిగానే కాకుండా.. పలు జాతీయ అవార్డులను సైతం కొల్లగొట్టిన ఘనత వెట్రిమారన్ సొంతం. ఇక.. వెట్రిమారన్ గత చిత్రం 'అసురన్' సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 


తాజాగా ఎన్టీఆర్ కోసం వెట్రిమారన్ మంచి ఎమోషన్‌తో కూడిన ఓ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ సబ్జెక్ట్ చెప్పాడట. ఆ కథ బాగా నచ్చడంతో.. త్రివిక్రమ్ కంటే ముందే వెట్రిమారన్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నాడట యంగ్ టైగర్. పైగా.. వెట్రిమారన్ వంటి దర్శకుడితో సినిమా చేస్తే.. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు కొట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. మరి ఎన్టీఆర్-వెట్రిమారన్ మూవీ పట్టాలెక్కుతుందా? వెయిట్ అండ్ సీ.


Updated Date - 2020-02-14T23:16:24+05:30 IST