నయనతార లేక కీర్తి సురేష్.. ఎవరా పాత్రలో నటిస్తారు!
ABN , First Publish Date - 2020-12-29T20:21:02+05:30 IST
శివగంగ సీమలో 17వ శతాబ్దంలో తెల్లదొరలపై పోరు సాగించిన ధీరవనిత వేలు నాచ్చియార్ జీవిత విశేషాలతో ఓ తమిళ చిత్రం తయారవుతోంది.

శివగంగ సీమలో 17వ శతాబ్దంలో తెల్లదొరలపై పోరు సాగించిన ధీరవనిత వేలు నాచ్చియార్ జీవిత విశేషాలతో ఓ తమిళ చిత్రం తయారవుతోంది. ఈ చిత్రానికి ‘ఫైవ్‌స్టార్’, ‘తిరుట్టుపయలే’, ‘కందసామి’ చిత్రాలకు దర్శకత్వం వహించిన సుశిగణేషన్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రంలో వేలునాచ్చియర్ పాత్రలో నయనతారను నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల ‘మూక్కుత్తి అమ్మన్’ చిత్రంలో నయనతార అమ్మవారి పాత్రలో తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం వెరైటీ పాత్రలపైనే దృష్టిసారిస్తున్న నయనతార వేలునాచ్చియార్‌గా నటించేందుకు అంగీకరిస్తారని చెబుతున్నారు. ఒక వేళ నయనతార కాల్షీట్లు ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడితే ఆమెకు బదులుగా ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్‌ను ఎంపిక చేయాలని దర్శకుడు సుశిగణేషన్ భావిస్తున్నారు.