మ‌హేశ్ లేక బ‌న్నీ..ఇద్ద‌రిలో చిరంజీవితో న‌టించేదెవ‌రు?

ABN , First Publish Date - 2020-02-21T23:14:28+05:30 IST

'ఖైదీ నంబర్ 150'తో గ్రాండ్ గా రీ-ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి... ఆపై 'సైరా నరసింహారెడ్డి'తో అలరించాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ సినిమా చేస్తున్నాడు.

మ‌హేశ్ లేక బ‌న్నీ..ఇద్ద‌రిలో చిరంజీవితో న‌టించేదెవ‌రు?

'ఖైదీ నంబర్ 150'తో గ్రాండ్ గా రీ-ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి... ఆపై 'సైరా నరసింహారెడ్డి'తో అలరించాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ సినిమా చేస్తున్నాడు. ఇందులో చిరుతో పాటు మరో కథానాయకుడికి కూడా స్థానముందని... అందులో రామ్ చరణ్ నటిస్తాడని ఆ మధ్య ప్రచారం సాగింది. అయితే, రాజమౌళి మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్‌' డీలే కావడం... అది పూర్తయ్యే వరకు మరో సినిమా చేయనని జక్కన్నకి చరణ్ మాటివ్వడంతో... ఆలోచనలో పడ్డాడట చెర్రీ. పైగా 'చిరు 152'ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టులో రిలీజ్ చేయాలని డిసైడ్ అవడంతో... చరణ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. అయితే, ఇప్పుడదే పాత్ర కోసం ఇద్దరు స్టార్ల పేర్లు పరిశీలనలోకి రావడం వార్తల్లో నిలుస్తోంది. 


'చిరు 152'ని నిరంజన్ రెడ్డితో కలసి నిర్మిస్తున్నాడు చరణ్. అందుకే... తను చేయాలనుకున్న నక్సలైట్ పాత్రలో మరో స్టార్‌ని నటింపజేసే ప్రయత్నం చేస్తున్నాడట. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో రెండు సినిమాల్లో నటించిన మహేశ్ బాబుతో గానీ లేదంటే మరో మెగా కాంపౌండ్ హీరో అల్లు అర్జున్‌తో గానీ ఈ పాత్రని ధరింపజేసే యత్నం చేస్తున్నాడట చెర్రీ. మరి... ఈ ఇద్దరిలో ఎవరు 'చిరు 152'లో భాగమవుతారో చూడాలి. లేదంటే... చరణ్ నే ఎలాగోలా వీలు కుదుర్చుకుని నటిస్తాడేమో అన్నది కూడా ఆసక్తికరమే. చూద్దాం... ఏం జరుగుతుందో? 

Updated Date - 2020-02-21T23:14:28+05:30 IST