`ఆర్ఆర్ఆర్‌` త‌ర్వాత చ‌ర‌ణ్ ఛాయిస్ ఏంటి?

ABN , First Publish Date - 2020-02-03T19:57:26+05:30 IST

టాలీవుడ్ లో ఏ హీరో రాజమౌళి సినిమాలో నటించినా అదో పెద్ద సెన్సేషనే! 'బాహుబలి' తరువాత అయితే జక్కన్న ప్రాజెక్ట్ క్రేజ్ మరింత పెరిగిపోయింది.

`ఆర్ఆర్ఆర్‌` త‌ర్వాత చ‌ర‌ణ్ ఛాయిస్ ఏంటి?

టాలీవుడ్ లో ఏ హీరో రాజమౌళి సినిమాలో నటించినా అదో పెద్ద సెన్సేషనే! 'బాహుబలి' తరువాత అయితే జక్కన్న ప్రాజెక్ట్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇక ఇప్పుడైతే 'ఆర్ఆర్ఆర్' కోసం సంవత్సరానికి పైగా ఇద్దరు టాప్ స్టార్స్ ఆఫ్ స్క్రీన్ అయిపోయారు. తారక్, చరణ్ ఎప్పుడెప్పుడు తెర మీద కనిపిస్తారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే, 'ట్రిపుల్ ఆర్'తో పాటే చెర్రీ, ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీస్ గురించి తీవ్రంగా డిస్కషన్ నడుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి సూపర్ మల్టీ స్టారర్ లో నటిస్తోన్న యంగ్ టైగర్ తరువాత త్రివిక్రమ్ సినిమాలో దర్శనమిస్తాడని దాదాపుగా తెలిసిపోయింది. అయితే, ఇంత వరకూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. ఇక 'ఆర్ఆర్ఆర్'లో మరో హీరో అయిన రామ్ చరణ్ తరువాతి చిత్రం ఏంటో మాత్రం అస్సలు క్లారిటీ లేదు. ఇప్పటి వరకూ చాలా మంది దర్శకుల పేర్లే వినిపించాయి. తాజాగా మరో ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ పేర్లు మెగా పవర్ స్టార్‌తో ముడిపడి వినిపిస్తున్నాయి.

`ఆర్ఆర్ఆర్` త‌ర్వాత చరణ్‌తో మూవీ చేసేందుకు అనిల్ రావిపూడి ఉత్సాహం చూపాడట. 'సరిలేరు నీకెవ్వరూ' హిట్ టాక్ సంపాదించటంతో ఈ యంగ్ డైరెక్టర్ మంచి ఉత్సాహంగా ఉన్నాడు. అయితే, రామ్ చరణ్ కి డైరెక్టర్ సుజీత్ కూడా ఒక కథ చెప్పాడట. 'సాహో' ఆశించిన స్థాయిలో అద్భుతాలు సృష్టించకున్నా చెర్రీ మాత్రం సుజీత్ కే ఓటు వేశాడని చెప్పుకుంటున్నారు. అనిల్ రావిపూడి చెప్పిన సబ్జెక్ట్ కంటే సుజీత్ స్టోరీ పైనే గురి కుదరటంతో నెక్ట్స్ అతనితోనే మూవీ అని ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి, ఫైనల్ గా మెగాపవర్ ఫుల్ ఆఫర్ ఏ దర్శకుడ్ని వరిస్తుందో.


Updated Date - 2020-02-03T19:57:26+05:30 IST