సురేంద‌ర్ రెడ్డి వెబ్ సిరీస్‌...?

ABN , First Publish Date - 2020-06-15T16:37:40+05:30 IST

‘సైరా న‌ర‌సింహా రెడ్డి’ చిత్రం త‌ర్వాత డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి మ‌రో సినిమాను అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు.

సురేంద‌ర్ రెడ్డి వెబ్ సిరీస్‌...?

‘సైరా న‌ర‌సింహా రెడ్డి’ చిత్రం త‌ర్వాత డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి మ‌రో సినిమాను అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. వ‌రుణ్ తేజ్‌తో సురేంద‌ర్ రెడ్డి ఓ సినిమా చేస్తార‌ని ఇటీవ‌ల వార్త‌లు వినిపించాయి. అయితే లేటెస్ట్‌గా సోష‌ల్ మీడియాలో సురేంద‌ర్ రెడ్డి ఓ వెబ్ సిరీస్‌లో భాగం కాబోతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అహాలో సురేంద‌ర్ రెడ్డి వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. తెలుగు డిజిట‌ల్ తెర‌పై ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని ఎడ్వేంచ‌ర‌స్ వెబ్ సిరీస్‌ను సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తార‌ని టాక్‌. మ‌రి ఈ వార్త‌ల‌పై అటు అల్లు అర‌వింద్, ఇటు సురేంద‌ర్ రెడ్డి ఏమైనా స్పందిస్తారేమో వేచి చూడాలి. 

Updated Date - 2020-06-15T16:37:40+05:30 IST