ఎన్నికల బరిలోకి విశాల్?

ABN , First Publish Date - 2020-12-15T17:39:34+05:30 IST

తమిళనాట రాజకీయాలకు, సినిమాలకు ఎప్పట్నుంచో అవినాభావ సంబంధం ఉంది.

ఎన్నికల బరిలోకి విశాల్?

తమిళనాట రాజకీయాలకు, సినిమాలకు ఎప్పట్నుంచో అవినాభావ సంబంధం ఉంది. అక్కడి రాజకీయాల్లో సినీ ప్రముఖులదే ప్రధాన పాత్ర. మరో ఆరు నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అక్కిడి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సూపర్‌స్టార్ రజినీకాంత్ ఈ ఎన్నికల బరిలోకి దిగేందుకు సన్నాహలు చేసుకుంటున్నారు. యువ హీరో విశాల్ కూడా ఎలక్షన్ ఫైట్‌లోకి దిగబోతున్నాడట. 


నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శిగా, తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా పోటీ చేసి గెలుపోందిన విశాల్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతున్నాడట. చెన్నైలోని ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నాడట. ఇప్పటికే అభిమాన సంఘాల నేతలతో చర్చలు కూడా జరిపాడట. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి అనంతరం జరిగిన ఆర్కే నగర్ ఉపఎన్నికలో విశాల్‌ పోటీ చేయాలనుకున్నాడు. నామినేషన్ కూడా వేశాడు. అయితే నామినేషన్‌ను ప్రతిపాదించిన వారిలో కొంత మంది తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో ఎన్నికల కమిషన్‌ విశాల్‌ నామినేషన్‌ను తిరస్కరించింది. దీంతో ఆ ఉపఎన్నికల్లో విశాల్‌ పోటీ చేయలేకపోయాడు. రాబోయే ఎన్నికల్లో మాత్రం ఎలాగైనా బరిలోకి దిగాలని విశాల్ ప్లాన్ చేస్తున్నాడట. 

Updated Date - 2020-12-15T17:39:34+05:30 IST