షరతులు వర్తిస్తాయంటున్న విజయ్ సేతుపతి?

ABN , First Publish Date - 2020-05-14T03:17:47+05:30 IST

ప్రతిభ గల నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి.

షరతులు వర్తిస్తాయంటున్న విజయ్ సేతుపతి?

ప్రతిభ గల నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి. మెగాస్టార్ చిరంజీవి `సైరా` సినిమాతో తెలుగు తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత సాయిధరమ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన `ఉప్పెన` సినిమాలో విలన్‌గా నటించాడు. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న `పుష్ప`లో కూడా నటించబోతున్నాడని వార్తలు వచ్చాయి. 


ఈ క్రమంలో మరికొందరు తెలుగు నిర్మాతలు విజయ్‌ను తమ సినిమాల కోసం సంప్రదిస్తున్నారట. అయితే విజయ్ కండీషన్స్ వాళ్లను ఇబ్బంది పెడుతున్నాయట. ఒక్కో సినిమాకు విజయ్ రూ.8 కోట్లపైనే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. అలాగే తను తెలుగులో నటించిన సినిమాలను తమిళనాడులో విడుదల చేయకూడదని షరతు పెడుతున్నాడట. ఈ షరతులకు అంగీకరించకపోవడం వల్లే `పుష్ప` నుంచి విజయ్ తప్పుకున్నాడట. విజయ్ షరతులు విన్న తర్వాత చాలా మంది దర్శకులు వెనక్కి తగ్గుతున్నట్టు సమాచారం. 

Updated Date - 2020-05-14T03:17:47+05:30 IST