‘సర్కారు వారి పాట’లో సెకండ్ హీరోయిన్.. ఎవరంటే?

ABN , First Publish Date - 2020-08-04T22:28:36+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, ‘గీతగోవిందం’ దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న చిత్రాన్ని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ‘సర్కారు వారి పాట’ అనే

‘సర్కారు వారి పాట’లో సెకండ్ హీరోయిన్.. ఎవరంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు, ‘గీతగోవిందం’ దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న చిత్రాన్ని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ‘సర్కారు వారి పాట’ అనే ఆసక్తికర టైటిల్‌తో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీ లుక్‌ని కూడా విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఫస్ట్ టైమ్ మహేష్ సరసన కీర్తిసురేష్ నటించబోతోంది. ఈ విషయం స్వయంగా ఆమె తెలిపింది. ‘సర్కారు వారి పాట’లో హీరోయిన్‌గా చేస్తున్నానంటూ ‘మహానటి’ కీర్తిసురేష్ తెలపడంతో.. ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్‌కి కూడా స్కోప్ ఉందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


అంతేకాదు ‘సర్కారు వారి పాట’ సెకండ్ హీరోయిన్ అంటూ ఓ హీరోయిన్ పేరు కూడా నెట్‌లో ప్రకటించేశారు. పూరీ జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో పాన్ ఇండియా ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటున్న చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయం అవుతున్న అనన్య పాండేని ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటింపజేసేందుకు ‘సర్కారు వారి పాట’ టీమ్ ప్రయత్నాలు చేస్తుందట. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చక్కబడగానే ఆమెకు కథ వినిపించాలని పరశురామ్ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. అయితే చిత్రయూనిట్ మాత్రం ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. నెట్‌లో మాత్రం మహేష్ సరసన విజయ్ దేవరకొండ హీరోయిన్ అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2020-08-04T22:28:36+05:30 IST