అభినందన్ పాత్రలో విజయ్ దేవరకొండ?

ABN , First Publish Date - 2020-09-24T19:26:07+05:30 IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ పూర్తి స్థాయి బాలీవుడ్ చిత్రంలో నటించనున్నాడా

అభినందన్ పాత్రలో విజయ్ దేవరకొండ?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ పూర్తి స్థాయి బాలీవుడ్ చిత్రంలో నటించనున్నాడా? భారత వింగ్‌కమాండర్‌ అభినందన్ జీవితం ఆధారంగా రూపొందనున్న సినిమాలో నటించేందుకు అంగీకరించాడా? అవుననే అంటున్నాయి బాలవుడ్ వర్గాలు. దర్శకుడు అభిషేక్ కపూర్ ఈ సినిమాను రూపొందించనున్నాడట.


గత ఏడాది భారత్‌, పాకిస్తాన్‌ సైనికుల మధ్య జరిగిన దాడిలో భారత వింగ్‌కమాండర్‌ అభినందన్‌.. పాక్ సైనికుల చేతికి చిక్కి మూడు రోజులు బంధీగా ఉన్నారు. అనంతరం పాక్‌ ప్రభుత్వం అభినందన్‌ని భారత ప్రభుత్వానికి అప్పగించింది. ఆ కథనం ఆధారంగా అభిషేక్‌ కపూర్‌ ఓ సినిమా రూపొందించనున్నారట. సంజయ్‌లీలా భన్సాలీ, భూషణ్‌కుమార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారట. స్క్రిప్ట్ నచ్చడంతో విజయ్ ఈ సినిమా చేయడానికి అంగీకరించినట్టు సమాచారం. అయితే ఈ సినిమా విషయమై అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదు. 


Updated Date - 2020-09-24T19:26:07+05:30 IST