శేఖర్ కమ్ములతో వెంకటేష్?

ABN , First Publish Date - 2020-06-29T22:33:42+05:30 IST

రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా తనదైన శైలిలో సినిమాలు తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ములకు

శేఖర్ కమ్ములతో వెంకటేష్?

రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా తనదైన శైలిలో సినిమాలు తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ములకు టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా `లవ్‌స్టోరీ` సినిమాను తెరకెక్కిస్తున్నారు. 


`లవ్‌స్టోరీ` తర్వాత శేఖర్ తెరకెక్కించబోయే సినిమాలో సీనియర్ హీరో వెంకటేష్ నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. లాక్‌డౌన్ సమయంలో శేఖర్ ఈ స్క్రిప్టు సిద్ధం చేశారట. ఇటీవల వెంకీని కలసి కథ వినిపించారట. కథ నచ్చడంతో వెంకీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వెంకీ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల రూపొందిస్తున్న `నారప్ప` చిత్రంలో నటిస్తున్నారు. 

Updated Date - 2020-06-29T22:33:42+05:30 IST