వెంకీ, నాని కాంబినేష‌న్‌..?

ABN , First Publish Date - 2020-05-26T13:47:46+05:30 IST

విక్ట‌రీ వెంటేశ్‌, నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్‌లో ఓ సినిమా ప్రారంభం అవుతుంద‌ని సినీ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

వెంకీ, నాని కాంబినేష‌న్‌..?

విక్ట‌రీ వెంటేశ్‌, నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్‌లో ఓ సినిమా ప్రారంభం అవుతుంద‌ని సినీ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. వివ‌రాల్లోకెళ్తే.. మాట‌ల మాంత్రికుడు, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేశ్ హీరోగా ఓ సినిమా రూపొందాల్సి ఉంద‌నే విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో త్రివిక్ర‌మ్ సినిమాను చేయ‌బోతున్నాడు. ఈ సినిమా త‌ర్వాత వెంకీని త్రివిక్ర‌మ్ డైరెక్ట్ చేస్తాడ‌ని టాక్‌. ఈ సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అదేంటంటే వెంకీ, త్రివిక్ర‌మ్ చిత్రంలో నాని కూడా న‌టించే అవ‌కాశాలున్నాయ‌ట‌. ఇప్ప‌టికే ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్‌ను పూర్తి చేశాడు త్రివిక్ర‌మ్‌. కానీ సినిమా సెట్స్‌పైకి వెళ్లాలంటే మాత్రం స‌మ‌యం ప‌డుతుంది. ఈ గ్యాప్‌లో త్రివిక్ర‌మ్ వెంక‌టేశ్‌, నాని సినిమా స్క్రిప్ట్‌పై క‌స‌రత్తులు చేయాల‌ని అనుకుంటున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

Updated Date - 2020-05-26T13:47:46+05:30 IST