వెంకీ@75.. ఛాన్స్ ఎవరికి?

ABN , First Publish Date - 2020-08-17T22:04:43+05:30 IST

సీనియర్ హీరో, `విక్టరీ` వెంకటేష్ మరో మైలురాయికి చేరువ కాబోతున్నారు.

వెంకీ@75.. ఛాన్స్ ఎవరికి?

మూడు దశాబ్దాల క్రితం కెరీర్ ప్రారంభించిన `విక్టరీ` వెంకటేష్ ఇప్పటికీ అదే జోష్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. వెంకీ త్వరలో మరో మైలురాయికి చేరువ కాబోతున్నారు. 75వ సినిమాకు చేరువవుతున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో `నారప్ప` సినిమా చేస్తున్నారు. ఇది వెంకీ కెరీర్‌లో 74వ సినిమా. 


వెంకీ 75వ సినిమా ప్రత్యేకంగా ఉండేలా నిర్మాత సురేష్ బాబు ప్లాన్ చేస్తున్నారట. పలువురు దర్శకులు చెప్పిన కథలను ఇప్పటికే సురేష్ బాబు విన్నారట. యంగ్ డైరెక్టర్లను కూడా లైన్‌లో పెడుతున్నారట. యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రస్తుతం వెంకీ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నాడు. ఆ కథ నచ్చితే వెంకీ 75వ సినిమా డైరెక్షన్ ఛాన్స్ తరుణ్‌కే ఇవ్వబోతున్నట్టు సమాచారం. అలాగే కిశోర్ తిరుమల కూడా వెంకీ కోసం కథ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరీ జగన్నాథ్ వంటి దర్శకులను కూడా సురేష్ బాబు సంప్రదించబోతున్నట్టు సమాచారం. 

Updated Date - 2020-08-17T22:04:43+05:30 IST