క్రిష్, సురేందర్ కాంబోలో వరుణ్ తేజ్ మూవీ..!

ABN , First Publish Date - 2020-06-05T15:43:58+05:30 IST

‘గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌’, ‘ఎఫ్‌2’ చిత్రాలతో వ‌రుస సక్సెస్‌లు సాధించిన హీరో వ‌రుణ్ తేజ్ ఇప్పుడొక స్పోర్ట్స్ డ్రామాలో న‌టిస్తున్నారు.

క్రిష్, సురేందర్ కాంబోలో వరుణ్ తేజ్ మూవీ..!

‘గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌’, ‘ఎఫ్‌2’ చిత్రాలతో వ‌రుస సక్సెస్‌లు సాధించిన హీరో వ‌రుణ్ తేజ్ ఇప్పుడొక స్పోర్ట్స్ డ్రామాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత ‘ఎఫ్ 3’లో వ‌రుణ్‌తేజ్ న‌టిస్తాడా? అనే దానిపై క్లారిటీ లేదు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం మెగా హీరో ఓ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. వివ‌రాల మేర‌కు డైరెక్ట‌ర్ క్రిష్‌, డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్‌లో రూపొంద‌బోయే చిత్రంలో వ‌రుణ్‌తేజ్ హీరోగా న‌టించ‌నున్నార‌ట‌. డైరెక్ట‌ర్ క్రిష్ నిర్మాణంలో సురేంద‌ర్ రెడ్డి డైరెక్ష‌న్‌లో సినిమా తెర‌కెక్కించ‌నుంద‌ట‌. ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి, వ‌క్కంతం వంశీ స్క్రిప్ట్ వ‌ర్క్ చేస్తున్నార‌ట‌. అంతా ఓకే అయిన త‌ర్వాత సినిమాను అనౌన్స్ చేస్తార‌ట‌. 

Updated Date - 2020-06-05T15:43:58+05:30 IST