వరుణ్ ఖాకీ దుస్తులు ధరించబోతున్నాడా?

ABN , First Publish Date - 2020-08-27T20:15:51+05:30 IST

వెండితెరపై పోలీస్ పాత్రల్లో చెలరేగిపోవాలని హీరోలందరూ ఉబలాటపడుతుంటారు.

వరుణ్ ఖాకీ దుస్తులు ధరించబోతున్నాడా?

వెండితెరపై పోలీస్ పాత్రల్లో చెలరేగిపోవాలని హీరోలందరూ ఉబలాటపడుతుంటారు. ఒక్కసారైనా ఖాకీ దుస్తులు ధరించి రౌడీల భరతం పట్టాలని కోరుకుంటారు. మెగా హీరో వరుణ్ తేజ్ కూడా పోలీస్ పాత్రలో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడట. వరుణ్ కోసం దర్శకుడు సాగరచంద్ర ఓ పోలీస్ కథ తయారుచేసాడట. 


`వాల్మీకి` కంటే ముందే ఈ సినిమా పట్టాలెక్కాల్సిందట. అయితే మధ్యలోకి హరీష్ శంకర్ రావడంతో అప్పుడు కుదరలేదట. వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. 14రీల్స్ ప్లస్ బ్యానర్ మీద ఈ సినిమా తెరకెక్కబోతోందట. వరుణ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత `ఎఫ్3` పట్టాలెక్కబోతోంది. ఈ రెండు సినిమాల తర్వాత సాగర్ చంద్ర సినిమా ఉంటుందని తెలుస్తోంది. 


Updated Date - 2020-08-27T20:15:51+05:30 IST