విక్రమ్‌ప్రభుకు జోడీగా ..!

ABN , First Publish Date - 2020-06-12T19:35:37+05:30 IST

‘దైవమగళ్‌’ తమిళటీవీ సీరియల్‌లో ‘సత్యా’ అనే క్యారెక్టర్‌లో నటించి ఇంటిల్లిపాది మహిళా ప్రేక్షకులను ఆకట్టుకున్న వాణిభోజన్‌ యువనటుడు విక్రమ్‌ ప్రభు సరసన ఓ కొత్త చిత్రంలో నటించనుంది.

విక్రమ్‌ప్రభుకు జోడీగా ..!

‘దైవమగళ్‌’ తమిళటీవీ సీరియల్‌లో ‘సత్యా’ అనే క్యారెక్టర్‌లో నటించి ఇంటిల్లిపాది మహిళా ప్రేక్షకులను ఆకట్టుకున్న వాణిభోజన్‌ యువనటుడు విక్రమ్‌ ప్రభు సరసన ఓ కొత్త చిత్రంలో నటించనుంది. ఊటీకి చెందిన ఈ అందాలభామ నితిన్‌సత్యా నిర్మిస్తున్న ‘లాకప్‌’ చిత్రంలో  వైభవ్‌కు జంటగా నటిస్తోంది. నటుడు సూర్యాకు చెందిన ‘2డి’ సంస్థ నిర్మించనున్న చిత్రంలో హీరోయిన్‌గా నటించనుంది. విదార్థ్‌ నిర్మించి నటించే చిత్రంలోనూ, దివంగత సినీ గేయరచయిత కణ్ణదాసన్‌ మనుమడు ఆదవ్‌ కణ్ణదాసన్‌ నటించే థ్రిల్లర్‌ చిత్రంలోనూ వాణిభోజన్‌ హీరోయిన్‌గా ఎంపికైంది.. బుల్లితెర స్థాయి నుంచి సినీ హీరోయిన్‌గా ఎదిగిన వాణిభోజన్‌ను తమిళ ప్రేక్షకులు ఎలా స్వాగతిస్తారో వేచి చూడాల్సిందే!

Updated Date - 2020-06-12T19:35:37+05:30 IST