పట్టాలెక్కనున్న వంశీ పైడిపల్లి వెబ్ సిరీస్?

ABN , First Publish Date - 2020-12-08T02:27:26+05:30 IST

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా `మహర్షి` సినిమా తెరకెక్కించి కమర్షియల్ విజయం అందుకున్నాడు డైరెక్టర్ వంశీపైడిపల్లి.

పట్టాలెక్కనున్న వంశీ పైడిపల్లి వెబ్ సిరీస్?

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా `మహర్షి` సినిమా తెరకెక్కించి  కమర్షియల్ విజయం అందుకున్నాడు డైరెక్టర్ వంశీపైడిపల్లి. మళ్లీ మహేష్ బాబుతోనే చేయాలనుకుని చాలా కాలం వెయిట్ చేశాడు. అయితే పలు కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. అయితే ఎప్పటికైనా మహేష్‌తో సినిమా ఉంటుందని ఇటీవల వంశీపైడిపల్లి వెల్లడించాడు.


సినిమా కంటే ముందు వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కబోతోందట. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో వంశీ పైడిపల్లి కూడా వెబ్ సిరీస్‌లపై దృష్టి సారించాడట. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన ఓటీటీ సంస్థ `ఆహా` కోసం ఓ వెబ్ సిరీస్‌ను రూపొందించనున్నాడట. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ మొదలు కాబోతున్నట్టు తెలుస్తోంది.


Updated Date - 2020-12-08T02:27:26+05:30 IST