వంశీ పైడిపల్లికి ఛాన్స్ లేనట్టేనా?

ABN , First Publish Date - 2020-04-25T16:04:00+05:30 IST

ఈ ఏడాది సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు`తో విజయం అందుకున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు ఆ తర్వాత డైరెక్టర్ వంశీ పైడిపల్లితో సినిమా చేయలనుకున్నారు

వంశీ పైడిపల్లికి ఛాన్స్ లేనట్టేనా?

ఈ ఏడాది సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు`తో విజయం అందుకున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు ఆ తర్వాత డైరెక్టర్ వంశీ పైడిపల్లితో సినిమా చేయలనుకున్నారు. అయితే వంశీ చెప్పిన కథ నచ్చకపోవడంతో ఆ సినిమాను పక్కనపెట్టారు. `గీతగోవిందం` డైరెక్టర్ పరశురామ్‌కు అవకాశం ఇచ్చారు. 


పరశురామ్‌ సినిమా తర్వాత వంశీ పైడపల్లి సినిమాను మహేష్ పట్టాలెక్కిస్తారని అంతా అనుకున్నారు. అయితే వంశీకి ఛాన్స్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. `ఆర్ఆర్ఆర్` తర్వాత మహేష్‌తో సినిమా ఉంటుందని రాజమౌళి ప్రకటించారు. రాజమౌళి సినిమా ప్రారంభమయ్యే లోపల త్రివిక్రమ్‌తో సినిమా చేయాలని మహేష్ అనుకుంటున్నట్టు సమాచారం. పరశురామ్, త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలు పూర్తయ్యేసరికి కనీసం మూడునాలుగేళ్లు పడుతుంది. కాబట్టి వంశీ-మహేష్ సినిమా ఉండదని టాలీవుడ్ వర్గాల సమాచారం. 

Updated Date - 2020-04-25T16:04:00+05:30 IST