`వకీల్ సాబ్` వేసవిలోనే..?

ABN , First Publish Date - 2020-11-17T21:14:45+05:30 IST

రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ `వకీల్ సాబ్` సినిమాతో వెండితెర పునరాగమనం చేయబోతున్నారు.

`వకీల్ సాబ్` వేసవిలోనే..?

రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ `వకీల్ సాబ్` సినిమాతో వెండితెర పునరాగమనం చేయబోతున్నారు. హిందీలో విజయవంతమైన `పింక్` సినిమాకు ఇది రీమేక్. వేణు శ్రీరామ్ దర్శకుడు. బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పవన్ సరసన శ్రుతి కథానాయికగా నటిస్తోంది. 


వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదలవుతుందని ప్రచారం జరిగింది. అయితే అది సాధ్యం కాదని తాజా సమాచారం. ఇంకా షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో `వకీల్ సాబ్` సంక్రాంతి బరి నుంచి దాదాపు తప్పుకున్నట్టేనని తెలుస్తోంది. వేసవి సందర్భంగా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారట. మరి, పవన్ ఫ్యాన్స్ అప్పటివరకు ఆగాల్సిందే. 

Updated Date - 2020-11-17T21:14:45+05:30 IST