సెంటిమెంట్ ఫాలో అవుతున్న మెగా హీరో!!

ABN , First Publish Date - 2020-08-08T14:11:33+05:30 IST

నేటిత‌రం మెగా హీరోలంద‌రూ ఓ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. తొలి సినిమాను బ‌య‌టి బ్యాన‌ర్‌లో రెండో సినిమాను గీతాఆర్ట్స్‌లో చేస్తున్నారు.

సెంటిమెంట్ ఫాలో అవుతున్న మెగా హీరో!!

నేటిత‌రం మెగా హీరోలంద‌రూ ఓ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. తొలి సినిమాను బ‌య‌టి బ్యాన‌ర్‌లో రెండో సినిమాను గీతాఆర్ట్స్‌లో చేస్తున్నారు.  రామ్‌చ‌ర‌ణ్ తొలి సినిమా ‘చిరుత’ను వైజ‌యంతీ మూవీస్ నిర్మిస్తే రెండో సినిమా ‘మగధీర’ను గీతాఆర్ట్స్ నిర్మించింది. అలాగే సాయితేజ్ తొలి సినిమా ‘రేయ్‌’ను వైవీఎస్ చౌద‌రి నిర్మించ‌గా, రెండో సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’ను గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో చేశాడు. అల్లు శిరీష్ విష‌యంలోనూ అంతే. ఇప్పుడు వైష్ణ‌వ్ తేజ్ విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న హీరోగా న‌టించిన ఉప్పెన చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌గా, రెండో చిత్రాన్ని గీతాఆర్ట్స్ నిర్మించ‌నుంద‌ని స‌మాచారం. ఉప్పెన విడుద‌ల తర్వాత వైష్ణ‌వ్ తేజ్ రెండో సినిమా ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని టాక్‌. 

Updated Date - 2020-08-08T14:11:33+05:30 IST

Read more