`ఉప్పెన` విడుదల ఎప్పుడు?

ABN , First Publish Date - 2020-12-08T02:01:37+05:30 IST

మెగా మేనల్లుడు, సాయి తేజ్‌ తమ్ముడు `పంజా` వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా `ఉప్పెన`.

`ఉప్పెన` విడుదల ఎప్పుడు?

మెగా మేనల్లుడు, సాయి తేజ్‌ తమ్ముడు `పంజా` వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా `ఉప్పెన`. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. తమిళ ప్రముఖ కథానాయకుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు.


రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని పాటలు మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకున్నారు. అయితే.. కరోనా కారణంగా కుదరలేదు. ఓటీటీల నుంచి భారీ ఆఫర్స్ వచ్చినప్పటికీ నో చెప్పారని, థియేటర్లోనే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారని టాక్. క్రిస్మస్‌కు కానీ సంక్రాంతి కానీ విడుదలవుతుందని వార్తలు వచ్చాయి. అయితే వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్టు తాజా సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్ టైమ్‌కు అంతా సర్దుకుంటుందని, అప్పుడే `ఉప్పెన` సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారట. 

Updated Date - 2020-12-08T02:01:37+05:30 IST