‘బిగ్‌బాస్’ హౌస్‌లోకి ‘జబర్థస్త్‌’లోని ఈ ఇద్దరు

ABN , First Publish Date - 2020-08-25T03:14:07+05:30 IST

తెలుగు టెలివిజన్‌లో అత్యుత్తమమైన రేటింగ్స్‌ని సాధించి, వినోదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన అతిపెద్ద నాన్ ఫిక్షన్ షో ‘బిగ్‌బాస్’ నాలుగో సీజన్‌తో తెలుగు ప్రేక్షకుల

‘బిగ్‌బాస్’ హౌస్‌లోకి ‘జబర్థస్త్‌’లోని ఈ ఇద్దరు

తెలుగు టెలివిజన్‌లో అత్యుత్తమమైన రేటింగ్స్‌ని సాధించి, వినోదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన అతిపెద్ద నాన్ ఫిక్షన్ షో ‘బిగ్‌బాస్’ నాలుగో సీజన్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు అతి త్వరలో రాబోతోంది. ప్రతి సీజన్‌లో విలక్షణత వచ్చినట్లే.. నాలుగో సీజన్‌కి స్టార్ మా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరింత కొత్తగా ప్రచారాన్ని ప్రారంభిస్తోంది. తాజాగా ఈ సీజన్‌కు సంబంధించిన ప్రచార చిత్రాన్ని ఇటీవల స్టార్ మా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రచార చిత్రంలో నాగార్జున.. తాతయ్య, కొడుకు, మనవడు పాత్రలతో అలరించడమే కాకుండా.. షో‌పై భారీగా అంచనాలు పెంచేశారు. ఇక ఈ షోకి సంబంధించి.. కంటెస్టెంట్స్ విషయంలో ఇప్పటికే కొన్ని పేర్లు వినిపించడం.. ఆ పేర్లలో కొందరు ఖండిస్తుండటం వంటివి జరుగుతూ ఉన్నాయి.


తాజాగా ఈ షో‌లో ‘జబర్థస్త్’ కామెడీ షోలోని కమెడియన్స్ ఇద్దరు పాల్గొనబోతోన్నట్లుగా వార్తలు వినవస్తున్నాయి. ఆ ఇద్దరు కమెడియన్స్ మరెవరో కాదు. ఆటో పంచ్ రామ్‌ప్రసాద్ మరియు ముక్కు అవినాష్. వీరిద్దరూ ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో కామెడీ పార్ట్‌ను తీసుకోబోతోన్నట్లుగా టాక్. వీరే కాకుండా మరికొందరి పేర్లు కూడా బయటికి వచ్చాయి కానీ.. చివరికీ ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎవరు అడుగుపెడతారు అనేది.. మరికొద్ది రోజుల్లో తెలిసిపోనుంది.  

Updated Date - 2020-08-25T03:14:07+05:30 IST