మళ్లీ త్రివిక్రమ్ సినిమాలో పూజ?

ABN , First Publish Date - 2020-02-21T18:24:25+05:30 IST

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ ఒకే కథానాయికతో వరుసగా సినిమాలు చేస్తుంటారు.

మళ్లీ త్రివిక్రమ్ సినిమాలో పూజ?

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ ఒకే కథానాయికతో వరుసగా సినిమాలు చేస్తుంటారు. గతంలో ఇలియానాతో రెండు సినిమాలు చేసిన త్రివిక్రమ్.. సమంతతో మూడు సినిమాలు చేశారు. తాజాగా పూజా హెగ్డేతో వరుసగా `అరవింద సమేత`, `అల వైకుంఠపురములో..` సినిమాలు చేశారు. 


త్వరలో ఎన్టీయార్‌తో చేయబోతున్న సినిమాలోనూ పూజనే తీసుకోవాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. పూజ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన గత రెండు సినిమాలు విజయవంతమయ్యాయి. అందుకే సెంటిమెంట్‌గా మూడో సినిమాలోనూ పూజనే నాయికగా ఎంచుకోవాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. మరోవైపు రష్మిక పేరు కూడా వినిపిస్తోంది. మరి, ఈ సినిమాలో ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

Updated Date - 2020-02-21T18:24:25+05:30 IST