రామాయణానికి త్రివిక్రమ్ మాటలు రాశారా?
ABN , First Publish Date - 2020-12-15T15:23:23+05:30 IST
`రామాయణం` ఆధారంగా భారతీయ చలన చిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఓ సినిమాను రూపొందించబోతున్నట్టు

`రామాయణం` ఆధారంగా భారతీయ చలన చిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఓ సినిమాను రూపొందించబోతున్నట్టు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మూడేళ్ల కిందట ప్రకటించారు. ప్రముఖ నిర్మాతలు నమిత్ మల్హోత్రా, మధు మంతెనతో కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నట్టు అరవింద్ ప్రకటించారు. ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎలాంటి వార్తా బయటకు రాలేదు. అయితే తెర వెనుక ఈ సినిమాకు సంబంధించిన పనులు చురుగ్గానే సాగుతున్నాయట.
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా కోసం డైలాగ్ రైటర్‌గా మారారట. అరవింద్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా త్రివిక్రమ్ ఈ సినిమాకు సంభాషణలు అందించారట. లాక్‌డౌన్ సమయంలోనే ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్ వెర్షన్‌ను త్రివిక్రమ్ పూర్తి చేసినట్టు సమాచారం. తెలుగులో ఆయన రాసిన డైలాగులను బట్టే హిందీ, తమిళ వెర్షన్ సంభాషణలను రాయిస్తారట. `దంగల్` దర్శకుడు నితీష్ తివారి, `మామ్` డైరెక్టర్ రవి ఉద్యావర్ ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కించనున్నారు.
Read more