ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు ట్రిపుల్‌ ధమాకా..!

ABN , First Publish Date - 2020-10-08T01:40:54+05:30 IST

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ దసరాకు ఏమైనా ట్రీట్‌ వస్తుందేమోనని అందరూ అనుకుంటున్నారు. సినీ వర్గాల సమాచారం మేరకు...

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు ట్రిపుల్‌ ధమాకా..!

'బాహుబలి'తో తర్వాత ప్రభాస్‌ ఇప్పుడు వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలే చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం 'రాధేశ్యామ్‌' సినిమా షూటింగ్‌ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ చిత్రం, ఓం రావుత్‌ దర్శకత్వంలో 'ఆదిపురుష్‌' సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఇవన్నీ ఓకే కానీ.. ఇప్పటి వరకు 'రాధేశ్యామ్‌'కు సంబంధించిన టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ తప్ప మరే అప్‌డేట్‌ లేదు. ఈ తరుణంలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ దసరాకు ఏమైనా ట్రీట్‌ వస్తుందేమోనని అందరూ అనుకుంటున్నారు. సినీ వర్గాల సమాచారం మేరకు, దసరాకు అలాగే ప్రభాస్‌ పుట్టినరోజుకు కలిపి 'రాధేశ్యామ్‌' టీజర్‌ ట్రీట్‌గా విడుదలవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు నాగ్‌ అశ్విన్‌, ఆదిపురుష్‌ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ కూడా ఉంటాయని తాజా కబర్‌.  'రాధేశ్యామ్‌'కు సంబంధించిన అప్‌డేట్స్‌ లేవని ఫీల్‌ అవుతున్న ఫ్యాన్స్‌కు డార్లింగ్‌ ఏకంగా ట్రిపుల్‌ ధమాకా ఇస్తున్నారని టాక్‌ చక్కర్లు కొడుతుంది. 


Updated Date - 2020-10-08T01:40:54+05:30 IST