హీరోలు ఇప్పట్లో రాకూడదనుకుంటున్నారా?

ABN , First Publish Date - 2020-06-16T02:18:47+05:30 IST

లాక్‌డౌన్ నిబంధనలకు చాలా సడలింపులు వచ్చేశాయి. రాష్ట్ర ప్రభుత్వాలు సినిమాల షూటింగ్‌లకు అనుమతిలిచ్చేశాయి.

హీరోలు ఇప్పట్లో రాకూడదనుకుంటున్నారా?

లాక్‌డౌన్ నిబంధనలకు చాలా సడలింపులు వచ్చేశాయి. రాష్ట్ర ప్రభుత్వాలు సినిమాల షూటింగ్‌లకు అనుమతులిచ్చేశాయి. అయినా షూటింగ్‌లు ఇప్పట్లో మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇప్పట్లో తొందరపడక పోవడమే మంచిదని సినీ ఇండస్ట్రీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో షూటింగ్‌లు మొదలుపెట్టే ఆలోచన ఎవరికీ లేనట్టు తెలుస్తోంది.

 

టాప్ హీరోలెవ్వరూ షూటింగ్‌లకు వచ్చేందుకు సిద్ధంగా లేరట. `ఆర్ఆర్ఆర్` షూటింగ్ కూడా ఇప్పట్లో మొదలయ్యే ఛాన్స్ లేదట. మాక్ షూట్‌ను కూడా రాజమౌళి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. అరవైలు దాటిన వారికి అనుమతి లేదు. దీంతో చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ తదితరులు ఇప్పట్లో షూటింగ్‌లకు హాజరు కారని తెలుస్తోంది. సూపర్‌స్టార్ మహేష్ అయితే జనవరి వరకు షూటింగ్‌కు రాకూడదని నిర్ణయించుకున్నట్టు సమాచారం. 

Updated Date - 2020-06-16T02:18:47+05:30 IST