‘న‌ర్త‌న‌శాల’ టికెట్ ధ‌ర ఎంతంటే..?

ABN , First Publish Date - 2020-10-21T14:27:26+05:30 IST

ఓటీటీ ద్వారా విడుద‌ల‌వుతున్న ‘నర్తనశాల’ సినిమాను చూడాలంటే రూ.50 పెట్టి టికెట్ కొనాల్సిందే. ఈ సినిమా ద్వారా వ‌చ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని సేవా కార్యక్ర‌మాల‌కు ఉప‌యోగించాల‌ని బాల‌కృష్ణ భావించారు.

‘న‌ర్త‌న‌శాల’ టికెట్ ధ‌ర ఎంతంటే..?

నటసింహ నందమూరి బాలకృష్ణ. ఆయన స్వీయ దర్శక నిర్మాణంలో పౌరాణిక చిత్రం 'నర్తనశాల'ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించిన దాదాపు 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకులు, అభిమానులు వీక్షించడానికి వీలుగా ఈ విజయదశమి సందర్భంగా అక్టోబర్‌ 24న విడుదల చేయాలని నిర్ణయించారు. ఓటీటీ ద్వారా విడుద‌ల‌వుతున్న ‘నర్తనశాల’ సినిమాను చూడాలంటే రూ.50 పెట్టి టికెట్ కొనాల్సిందే. ఈ సినిమా ద్వారా వ‌చ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని సేవా కార్యక్ర‌మాల‌కు ఉప‌యోగించాల‌ని బాల‌కృష్ణ భావించారు. బాల‌య్య అభిమానులైతే ఎంతైనా పెట్టి టికెట్ కొన‌వ‌చ్చున‌ని అన్నారు. దీంతో కొంత మంది అభిమానులు ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు పెట్టి టిక్ కొనాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. వారి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే బాల‌కృష్ణ ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. 

Updated Date - 2020-10-21T14:27:26+05:30 IST