కమల్ సరసన ముగ్గురు హీరోయిన్స్
ABN , First Publish Date - 2020-05-25T18:56:26+05:30 IST
ప్రస్తుతం ‘ఇండియన్2’లో నటిస్తున్న విశ్వనటుడు కమల్‌హాసన్ ఆ తరువాత ‘దేవర్‌మగన్’కు సీక్వెల్‌గా భావిస్తున్న ‘తలైవన్ ఇరుక్కిరాన్’ చిత్రంలో నటించనున్నారు.

ప్రస్తుతం ‘ఇండియన్2’లో నటిస్తున్న విశ్వనటుడు కమల్‌హాసన్ ఆ తరువాత ‘దేవర్‌మగన్’కు సీక్వెల్‌గా భావిస్తున్న ‘తలైవన్ ఇరుక్కిరాన్’ చిత్రంలో నటించనున్నారు. ఇందులో మక్కల్‌సెల్వన్ విజయ్ సేతుపతి ఒక ముఖ్యపాత్రలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా సమాచారం ఏమిటంటే.. ‘తలైవన్ ఇరుక్కిరాన్’లో కమల్ సరసన ముగ్గురు కథానాయికలు నటించనున్నారట. ‘దేవర్‌మగన్’లో నటించిన సీనియర్ తార రేవతి ఒకరు కాగా, ‘విశ్వరూపం’లో నటించిన పూజా కుమార్, ఆండ్రియా ఈ చిత్రంలో నటించనున్నట్టు కోలీవుడ్ టాక్.
Read more