‘ఆర్ఆర్ఆర్‌’ఫైట్‌... దాని స్ఫూర్తి ఆధారంగానా?

ABN , First Publish Date - 2020-02-02T21:52:12+05:30 IST

హాలీవుడ్ చిత్రాల నుండి ప్రేరణ పొంది సినిమాలను తెరకెక్కించే దర్శకులు తెలుగునాట చాలా మందే ఉన్నారు. వారిలో దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఒకరు. మనుషుల

‘ఆర్ఆర్ఆర్‌’ఫైట్‌... దాని స్ఫూర్తి ఆధారంగానా?

హాలీవుడ్ చిత్రాల నుండి ప్రేరణ పొంది సినిమాలను తెరకెక్కించే దర్శకులు తెలుగునాట చాలా మందే ఉన్నారు. వారిలో దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఒకరు. మనుషుల బంధాల నేపథ్యంలోనే, ఒక కమర్షియల్ ఎలిమెంట్ ని ఎంచుకొని.., వీటి చుట్టూ భారీ యాక్షన్ సీక్వెన్స్ లు డిజైన్స్ చేసుకొని సంచలన విజయాలు సాధించడంలో జక్కన్న దిట్ట. అయితే రాజమౌళి తెరకెక్కించిన 'మగధీర' 'బాహుబలి' సీరీస్ చిత్రాలలోని యాక్షన్ సీక్వెన్స్ లలో హాలీవుడ్ సినిమాల ప్రభావం తప్పక కనిపిస్తోంది.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్- రామ్ చరణ్లు ప్రధాన పాత్రల్లో భారీ మల్టీ స్టారర్ మూవీ 'RRR' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో తారక్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతొంది. అయితే రాజమౌళి ఇటీవలే ఎన్టీఆర్ ఓ పులితో ఫైట్ చేసే సన్నివేశాన్ని షూట్ చేశాడు. జక్కన్న ఈ యాక్షన్ సీక్వెన్స్ ని '300 యోధులు' సినిమాలో తోడేలు ఫైట్ నుండి ఇన్స్పైర్ అయినట్టు టాక్ వినిపిస్తోంది.

 

బాహుబలి సిరీస్ లతో యావత్ సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు రాజమౌళి. దీనితో 'RRR' చిత్రం పై కూడా జాతీయ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఆ స్థాయిని అందుకోవడానికే చిత్ర యూనిట్ 'RRR' విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. అయితే ఇంత కష్టపడుతున్నా.. 'RRR' కి లీకేజ్ ఇబ్బందులు తప్పడం లేదు. ఇది వరకే ఈ సినిమా షూటింగ్ లోకేషన్ నుండి ఎన్టీఆర్ లుక్ రివీల్ అయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పులితో చేసిన ఫైట్ సీన్కు సంబందించిన ఓ విజువల్స్ కూడా లీకైయ్యాయి. అయితే చిత్ర యూనిట్ ఇప్పటికే ఆ వీడియోను ఆన్ లైన్ నుండి తొలగించారు.ఏదేమైనా హాలీవుడ్ కి దీటుగా సినిమాలు తెరకెక్కిస్తున్న జక్కన్న..'RRR' కోసం ఈ స్థాయిలో పోరాట సన్నివేశాలు చిత్రీకరించడం అభిమానులను ఆకట్టుకుంటుంది. మరి ఇంత పవర్ ప్యాక్డ్ గా తెరకెక్కుతున్న 'RRR' రాబోయే కాలంలో ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి.

Updated Date - 2020-02-02T21:52:12+05:30 IST