డిజిట‌ల్ మాధ్య‌మంలోకి తేజ‌..!

ABN , First Publish Date - 2020-04-28T16:43:08+05:30 IST

క్రిష్ తర్వాత ఇప్పుడు మ‌రో ద‌ర్శ‌కుడు ఓటీటీ వైపు అడుగులేయ‌బోతున్నార‌ట‌. ఆ ద‌ర్శ‌కుడెవ‌రో కాదు..తేజ.

డిజిట‌ల్ మాధ్య‌మంలోకి తేజ‌..!

ప్ర‌స్తుతం సినిమా రంగానికి ధీటుగా డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్ అభివృద్ధి చెందుతోంది. క‌రోనా ఎఫెక్ట్ దీనికి ఇంకా క‌లిసొచ్చింది. దీంతో విడుద‌ల కాకుండా ఆగిపోయిన సినిమాల‌న్నీ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుద‌ల‌కావ‌డానికి రెడీ అవుతున్నాయి. క్ర‌మంగా ఓటీటీ ఫ్లామ్‌ఫామ్స్ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నాయి. టాలీవుడ్ విష‌యానికి వ‌స్తే మ‌న స్టార్స్‌, ద‌ర్శ‌క నిర్మాత‌లు ఓటీటీ వైపు అడుగులేస్తున్నారు. ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ క్రిష్ తెలుగు ఓటీటీ ఫ్లామ్‌పామ్ ఆహాతో క‌లిసి ప‌నిచేస్తున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే హాట్‌స్టార్‌తోనూ చేతులు క‌ల‌ప‌బోతున్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. కాగా ఇప్పుడు మ‌రో ద‌ర్శ‌కుడు ఓటీటీ వైపు అడుగులేయ‌బోతున్నార‌ట‌. ఆ ద‌ర్శ‌కుడెవ‌రో కాదు..తేజ. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో మూడు వెబ్ సిరీస్‌లు, రెండు సినిమాలు నిర్మించేలా తేజ డీల్ కుదుర్చుకున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై తేజ ఎలా స్పందిస్తాడో చూడాలి. 

Updated Date - 2020-04-28T16:43:08+05:30 IST