‘దృశ్యం2’లో కోలీవుడ్ అగ్రనటుడు?
ABN , First Publish Date - 2020-05-25T18:46:55+05:30 IST
మలయాళం మాతృకతో సహా తమిళం, తెలుగు, హిందీ భాషల్లోనూ సంచలనం సృష్టించిన ‘దృశ్యం’ చిత్రానికి రెండో భాగం తెరకెక్కబోతోంది.

మలయాళం మాతృకతో సహా తమిళం, తెలుగు, హిందీ భాషల్లోనూ సంచలనం సృష్టించిన ‘దృశ్యం’ చిత్రానికి రెండో భాగం తెరకెక్కబోతోంది. జీతు జోసఫ్ దర్శకత్వంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించనున్న సీక్వెల్ ఒక భాషకే పరిమితం చేయకుండా పాన్ ఇండియా లెవల్‌లో తీసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పలు భాషల్లో ఈ చిత్రం రీమేక్ అయినప్పటికీ మలయాళ ‘దృశ్యం’కు ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడిపోయింది. దీంతో దక్షిణాదిలో ఈ చిత్రం సీక్వెల్‌పైనా ఆసక్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలో దర్శకుడు జీతు జోసఫ్ సీక్వెల్‌లోని చాలా కీలకమైన పోలీసు అధికారి పాత్రలో తమిళ అగ్రనటుడ్ని నటింపజేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల తమిళంలో ‘దృశ్యం2’కి క్రేజ్ పెరగడంతోపాటు, దక్షిణాదిలో మార్కెట్ ఎక్కువగా జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.