తమన్నా సినిమా ఆగిందా?

ABN , First Publish Date - 2020-10-30T17:53:48+05:30 IST

కోవిడ్ ప్రభావంతో తమన్నా తన కమిట్‌మెంట్‌ ప్రకారం డేట్స్‌ను అడ్జస్ట్‌ చేయలేకపోతుందట. అందుకని ఒకట్రెండు సినిమాలను డ్రాప్‌ చేసుకోవాలని భావించింది. అందులో భాగంగా ...

తమన్నా సినిమా ఆగిందా?

సత్యదేవ్‌, మిల్కీబ్యూటీ తమన్నా హీరో హీరోయిన్లుగా ఇటీవల ఓ సినిమాను అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. కన్నడ చిత్రం 'లవ్‌ మాక్‌టైల్‌'కు ఇది రీమేక్‌. నాగశేఖర్‌ దర్శక నిర్మాణంలో 'గుర్తుందా శీతాకాలం' పేరుతో సినిమాను అనౌన్స్‌ చేశారు. అయితే సినీ వర్గాల తాజా సమాచారం మేరకు ఈ సినిమాను మేకర్స్‌ ఆపేశారట. కరోనా వైరస్‌ ప్రభావంతో సెట్స్‌పైకి వెళ్లాల్సిన సినిమాలన్నీ ఆగాయి. ఇప్పుడు అన్నీ ఒకేసారి స్టార్ట్‌ అవుతున్నాయి. దీంతో తమన్నా తన కమిట్‌మెంట్‌ ప్రకారం డేట్స్‌ను అడ్జస్ట్‌ చేయలేకపోతుందట. అందుకని ఒకట్రెండు సినిమాలను డ్రాప్‌ చేసుకోవాలని భావించింది. అందులో భాగంగా 'గుర్తుందా శీతాకాలం' సినిమా చేయనని మేకర్స్‌కు చెప్పేసిందట. మరో హీరోయిన్‌తో సినిమాను చేయకుండా వారు కూడా సినిమాను ఆపేసినట్లు సమాచారం. 


Updated Date - 2020-10-30T17:53:48+05:30 IST