తమన్నా ఓకే చెప్పడం వెనుక కారణం అదేనా..!

ABN , First Publish Date - 2020-09-16T16:05:24+05:30 IST

ఇప్పటికే కొందరు హీరోలు, హీరోయిన్స్‌ వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తుంటే.. మరికొందరు త్వరలోనే నటించడానికి రెడీ అయిపోయారు. అలాంటి వారి లిస్టులో మిల్కీబ్యూటీ తమన్నా కూడా చేరింది.

తమన్నా ఓకే చెప్పడం వెనుక కారణం అదేనా..!

వెండితెర, బుల్లితెరలకు ధీటుగా డిజిటల్‌ రంగానికి ఆదరణ పెరుగుతుంది. పలు సంస్థలు కొత్త కాన్సెప్టులను డిజిటల్‌ రంగంలో మేకర్స్‌ ప్రేక్షకులకు అందించడమే అందుకు కారణం. ఈ క్రమంలో మన స్టార్స్‌, టెక్నీషియన్స్‌, దర్శకులు, నిర్మాతలు డిజిటల్‌ రంగంలో భాగమవుతున్నారు. ఇప్పటికే కొందరు హీరోలు, హీరోయిన్స్‌ వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తుంటే.. మరికొందరు త్వరలోనే నటించడానికి రెడీ అయిపోయారు. అలాంటి వారి లిస్టులో మిల్కీబ్యూటీ తమన్నా కూడా చేరింది. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు ఓ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించనున్నారట. థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోయే ఈ వెబ్‌సిరీస్‌లో తమన్నా నటిస్తుందని టాక్‌. కథతో పాటు డైరెక్టర్‌ కథను డిజైన్‌ చేసిన తీరు తమన్నాకు నచ్చడంతో ఆమె నటించడానికి ఓకే చెప్పారని సోషల్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఎనిమిది ఎపిసోడ్స్‌గా ఈ వెబ్‌సిరీస్‌ను ప్రవీణ్‌ సత్తారు రూపొందిస్తారట. త్వరలోనే వివరాలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.  


Updated Date - 2020-09-16T16:05:24+05:30 IST