రజనీ, అజిత్‌ బాటలో సూర్య

ABN , First Publish Date - 2020-06-28T16:37:28+05:30 IST

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, తల అజిత్‌ బాటలో హీరో సూర్య పయనించాలని నిర్ణయించారు.

రజనీ, అజిత్‌ బాటలో సూర్య

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, తల అజిత్‌ బాటలో హీరో సూర్య పయనించాలని నిర్ణయించారు. మూడు నెలలకు పైగా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో రజనీ నటించిన ‘అన్నాత్తే’, అజిత్‌ నటించిన ‘వలిమై’ చిత్రాలు సహా పలు సినిమాల షూటింగులు ఆగిపోయాయి. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వైరస్‌ పూర్తిగా తొలగిపోయిందని అధికారిక ప్రకటన జారీ అయిన తర్వాతే ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటానని రజనీ ప్రకటించారు. ఇదేవిధంగా అజిత్‌ కూడా కరోనా వైరస్‌ పూర్తిగా నాశనమైన తర్వాతే షూటింగ్‌లో పాల్గొంటానని పేర్కొన్నారు. వీరిద్దరినీ ఆదర్శంగా తీసుకుని  అదే బాటలో యువనటుడు సూర్య కూడా తన ‘అరువా’ సినిమా షూటింగ్‌ను వచ్చే యేడాదికి వాయిదా వేసుకున్నారు. ‘అరువా’ చిత్రానికి ప్రముఖ దర్శకుడు హరి దర్శకత్వం వహిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ భయం ప్రజల్లో పూర్తిగా తొలగిపోతేనే షూటింగులు సవ్యంగా జరుగుతాయని సూర్య చెబుతున్నారు.

Updated Date - 2020-06-28T16:37:28+05:30 IST