కార్తితో సినిమా చేయనున్న లేడీ డైరెక్టర్‌..?

ABN , First Publish Date - 2020-11-13T21:15:01+05:30 IST

సుధా కొంగర తదుపరి అజిత్‌ సినిమాను డైరెక్ట్‌ చేయాల్సిందట. కానీ...

కార్తితో సినిమా చేయనున్న లేడీ డైరెక్టర్‌..?

ఇటీవల ఓటీటీలో విడుదలైన చిత్రం 'ఆకాశం నీ హద్దురా' చాలా పెద్ద విజయాన్ని దక్కించుకుంది. సూర్య నటన, సుధా కొంగర డైరెక్షన్‌ సినిమాకు మేజర్‌ ఎస్సెట్‌ అయ్యాయని అందరూ సినిమాను అప్రిషియేట్‌ చేస్తున్నారు. ఈ తరుణంలో సుధా కొంగర తదుపరి ఏ హీరోతో సినిమా చేస్తుందనే దానిపై పలు వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల మేరకు.. సుధా కొంగర తదుపరి అజిత్‌ సినిమాను డైరెక్ట్‌ చేయాల్సిందట. కానీ అజిత్‌ 'వలిమై' పూర్తి కావడానికి ఇంకా సమయం పట్టేలా ఉండటంతో..ఈలోపు సూర్య తమ్ముడు, హీరో కార్తితో సుధాకొంగర ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్‌. ఇప్పటికే కార్తికి లైన్‌ చెప్పినట్లు తనకి నచ్చిందని, పూర్తి స్క్రిప్ట్‌ సిద్ధం చేయమని చెప్పినట్లు సమాచారం. మరి ఇందులో నిజానిజాలేంటో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. 

Updated Date - 2020-11-13T21:15:01+05:30 IST