మ‌హిళా ద‌ర్శ‌కురాలితో విజ‌య్‌..?

ABN , First Publish Date - 2020-02-27T15:15:52+05:30 IST

త‌మిళ హీరో విజ‌య్ ఇప్పుడు తెలుగు సినీ మార్కెట్‌పై క‌న్నేశాడు. త‌న సినిమాల‌ను త‌మిళంతో పాటు తెలుగులోనూ స‌మాంత‌రంగా విడుద‌ల చేస్తూ వ‌స్తున్నాడు.

మ‌హిళా ద‌ర్శ‌కురాలితో విజ‌య్‌..?

త‌మిళ హీరో విజ‌య్ ఇప్పుడు తెలుగు సినీ మార్కెట్‌పై క‌న్నేశాడు. త‌న సినిమాల‌ను త‌మిళంతో పాటు తెలుగులోనూ స‌మాంత‌రంగా విడుద‌ల చేస్తూ వ‌స్తున్నాడు.  ఇప్పుడు విజ‌య్ హీరోగా `ఖైదీ` ఫేమ్ లోకేశ్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో `మాస్ట‌ర్‌` సినిమాను తెర‌కెక్కుతోంది. ఈ సినిమా త‌ర్వాత విజ‌య్ మ‌హిళా ద‌ర్శ‌కురాలు సుధా కొంగ‌ర‌తో సినిమా చేసే అవ‌కాశాలున్నాయ‌ని కోలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. రీసెంట్‌గా ఈ మ‌హిళా ద‌ర్శ‌కురాలు విజ‌య్‌ను క‌లిసి క‌థ‌ను చెప్పింద‌ని, ఆయ‌న‌కు కూడా న‌చ్చింద‌ని అంటున్నారు. అంతా ఓకే అయితే స‌న్ పిక్చ‌ర్స్ ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఉన్నాయి. సుధా కొంగర ఇప్పుడు హీరో సూర్య‌తో `శూర‌రై పోట్రు`(ఆకాశం నీ హ‌ద్దురా) అనే సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. 

Updated Date - 2020-02-27T15:15:52+05:30 IST