'మహా సముద్రం' టైటిల్‌ సీక్రెట్‌ ఇదేనా..?

ABN , First Publish Date - 2020-12-27T01:12:49+05:30 IST

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలుగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మహాసముద్రం’.

'మహా సముద్రం' టైటిల్‌ సీక్రెట్‌ ఇదేనా..?

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలుగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మహాసముద్రం’. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ గోవాలో కంటిన్యూగా జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో హీరోలు శర్వానంద్‌, సిద్ధార్థ్‌ పాల్గొంటున్నారు.  అదితీరావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా నటించనున్న ఈ చిత్రానికి చైతన్‌ భరద్వాజ్‌ సంగీత దర్శకుడు. రీసెంట్‌గా ఈ సినిమా టైటిల్‌ వెనుక అసలు కథ ఇదేనంటూ వార్తొకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. వివరాల మేరకు సినిమా మహా అనే అమ్మాయి చుట్టూ నడుస్తుందని, వైజాగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా కాబట్టి దీనికి 'మహాసముద్రం' అనే టైటిల్‌ను పెట్టారట. ఆర్‌.ఎక్స్‌ 100 తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. 


Updated Date - 2020-12-27T01:12:49+05:30 IST