కొరియన్‌ రీమేక్‌ ఓకే చెప్పిన శ్రీవాస్‌..!

ABN , First Publish Date - 2020-09-08T18:41:36+05:30 IST

'సాక్ష్యం' సినిమా తర్వాత డైరెక్టర్‌ శ్రీవాస్‌ మరో చిత్రాన్ని డైరెక్ట్‌ చేయలేదు. అయితే ఆయన త్వరలోనే ఓ కొరియన్‌ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

కొరియన్‌ రీమేక్‌ ఓకే చెప్పిన శ్రీవాస్‌..!

'సాక్ష్యం' సినిమా తర్వాత డైరెక్టర్‌ శ్రీవాస్‌ మరో చిత్రాన్ని డైరెక్ట్‌ చేయలేదు. అయితే ఆయన త్వరలోనే ఓ కొరియన్‌ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. వివరాల్లోకెళ్తే.. కొరియన్‌ మూవీ డాన్సింగ్‌ మూవీని సునీతా తాటి, డి.సురేష్‌ బాబు కలిసి తెలుగులో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ చిత్రాన్ని శ్రీవాస్‌ అయితే చక్కగా హ్యాండిల్‌ చేయగలరని వారు భావించి ఆయన్ని సంప్రదించారట. శ్రీవాస్‌ కూడా ఈ కొరియన్‌ రీమేక్‌కు ఓకే చెప్పారట. పెళ్లైన ఓ జంట వారి చివరి కోరికలను తీర్చుకునే క్రమంలో ఎలాంటి పరిస్థితులను ఫేస్‌ చేశారనేదే కథాంశమట. ఈ పాయింట్‌ను తెలుగు ప్రేక్షకులను మెప్పించేలా మన నెటివిటీకి తగినట్లు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించనున్నారట. 


Updated Date - 2020-09-08T18:41:36+05:30 IST