ఢీ అండ్ ఢీ అంటున్న విష్ణు, శ్రీనువైట్ల

ABN , First Publish Date - 2020-06-08T19:31:22+05:30 IST

మంచు విష్ణుకు క‌మ‌ర్షియ‌ల్ బ్రేక్ ఇచ్చిన చిత్రం ‘ఢీ’. ఈ కమర్షియల్ ఫార్ములాతో తర్వాత చాలా మంది దర్శకులు సినిమాలు చేశారు.

ఢీ అండ్ ఢీ అంటున్న విష్ణు, శ్రీనువైట్ల

మంచు విష్ణుకు క‌మ‌ర్షియ‌ల్ బ్రేక్ ఇచ్చిన చిత్రం ‘ఢీ’. ఈ కమర్షియల్ ఫార్ములాతో తర్వాత చాలా మంది దర్శకులు సినిమాలు చేశారు. ఢీ తర్వాత మళ్లీ విష్ణు, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో సినిమా రూపొంద‌లేదు. అయితే కొన్ని నెల‌ల నుండి వీరిద్ద‌రి కల‌యిక‌లో ఢీ 2 సినిమా రూపొంద‌నుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌పై శ్రీనువైట్ల వ‌ర్క్ చేస్తున్నార‌ని స‌మాచారం. లేటేస్ట్‌గా ఈ సినిమాకు ‘ఢీ అండ్ ఢీ’ అనే టైటిల్.. ‘డేరింగ్ అండ్ డాషింగ్‌’ అనేది క్యాప్ష‌న్ పెట్టార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం మంచు విష్ణు ‘మోస‌గాళ్లు’ సినిమాలో న‌టిస్తున్నారు. 

Updated Date - 2020-06-08T19:31:22+05:30 IST