కొడుకు సినిమాలో శ్రీకాంత్‌..!

ABN , First Publish Date - 2020-12-08T21:20:03+05:30 IST

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రూపొందుతున్న పెళ్లి సందడిలో శ్రీకాంత్ కూడా నటిస్తున్నారని టాక్.

కొడుకు సినిమాలో శ్రీకాంత్‌..!

విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, హీరో ఇలా విలక్షణ నటనతో నటుడిగా తనకంటూ  ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్న వారిలో శ్రీకాంత్‌ ఒకరు. ఈయన హీరోగా నటించిన చిత్రాల్లో 'పెళ్లి సందడి' ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు అదే టైటిల్‌తో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా సినిమా రూపొందుతోంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన శిష్యురాలు గౌరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉంది. కాగా తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో కొడుకు రోషన్‌తో పాటు శ్రీకాంత్‌ కూడా నటించనున్నాడట. కథకు చాలా కీలకంగా ఉండే పాత్రను శ్రీకాంత్‌ ఈ సినిమాలో పోషిస్తున్నారని టాక్‌. ఈ సినిమాలో హీరోయిన్‌ సహా ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే అనౌన్స్‌ చేసే అవకాశం ఉంది. 


Updated Date - 2020-12-08T21:20:03+05:30 IST