సాయితేజ్ సినిమాకు రూ.8 కోట్లు?

ABN , First Publish Date - 2020-12-03T02:49:43+05:30 IST

`ప్రతి రోజూ పండగే` వంటి పెద్ద హిట్ తర్వాత మెగా హీరో సాయితేజ్ నటిస్తున్న చిత్రం కావడంతో `సోలో బ్రతుకే సో బెటర్` మీద భారీ అంచనాలేర్పడ్డాయి.

సాయితేజ్ సినిమాకు రూ.8 కోట్లు?

`ప్రతి రోజూ పండగే` వంటి పెద్ద హిట్ తర్వాత మెగా హీరో సాయితేజ్ నటిస్తున్న చిత్రం కావడంతో `సోలో బ్రతుకే సో బెటర్` మీద భారీ అంచనాలేర్పడ్డాయి. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను యువ దర్శకుడు సుబ్బు రూపొందించాడు. నభా నటేష్ హీరోయిన్. తమన్ సంగీతం అందించాడు.


లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు అందుబాటులో లేకపోవడంతో ఈ సినిమాకు సంబంధించిన అన్ని హక్కులను నిర్మాత ఓ ఓటీటీ సంస్థకు అమ్మేశారు. డిజిటల్, శాటిలైట్ హక్కులను తన దగ్గరే ఉంచుకుని థియేటర్ హక్కులను సదరు ఓటీటీ సంస్థ అమ్మేసినట్టు తాజా సమాచారం. ఈ సినిమా థియేటర్ హక్కులను యువి సంస్థ రూ.8 కోట్లకు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

Updated Date - 2020-12-03T02:49:43+05:30 IST