‘మహా సముద్రం’లో మరో హీరో ఎవరంటే..?

ABN , First Publish Date - 2020-04-28T18:16:42+05:30 IST

తొలి చిత్రం ‘ఆర్‌.ఎక్స్ 100’తో సూప‌ర్‌డూప‌ర్‌హిట్ అందుకున్నారు డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి. అయితే రెండో సినిమాగా ‘మ‌హాసముద్రం’ను తెర‌కెక్కించాల‌నుకున్నారు.

‘మహా సముద్రం’లో మరో హీరో ఎవరంటే..?

తొలి చిత్రం ‘ఆర్‌.ఎక్స్ 100’తో సూప‌ర్‌డూప‌ర్‌హిట్ అందుకున్నారు డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి. అయితే రెండో సినిమాగా ‘మ‌హాసముద్రం’ను తెర‌కెక్కించాల‌నుకున్నారు. ఈ సినిమాను ట్రాక్ ఎక్కించడానికి అజయ్ భూపతి చాలా ప్రయత్నాలే చేశాడు. కానీ.. ఏదీ వ‌ర్క‌వుట్ కాలేదు. ఇందులో ఇద్ద‌రు హీరోలుంటారు. ఓ హీరోగా న‌టించ‌డానికి రీసెంట్‌గా శ‌ర్వానంద్ ఓకే చెప్పారు. దీంతో మ‌రో హీరో పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేశార‌ట‌. తాజా స‌మాచారం ప్ర‌కారం ఇందులో సిద్దార్థ్ హీరోగా న‌టిస్తాడ‌ని టాక్‌.  కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన పనులు మరింత స్పీడందుకుంటాయట. 

Updated Date - 2020-04-28T18:16:42+05:30 IST