పునర్జన్మల నేపథ్యంలో 'శ్యామ్‌సింగరాయ్‌'

ABN , First Publish Date - 2020-10-28T23:24:28+05:30 IST

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం 'శ్యామ్‌ సింగరాయ్‌'. ప్రస్తుతం 'టక్‌ జగదీష్‌' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న నాని, దీని తర్వాత 'శ్యామ్‌ సింగరాయ్‌'లో నటించనున్నారు.

పునర్జన్మల నేపథ్యంలో 'శ్యామ్‌సింగరాయ్‌'

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం 'శ్యామ్‌ సింగరాయ్‌'. ప్రస్తుతం 'టక్‌ జగదీష్‌' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న నాని, దీని తర్వాత 'శ్యామ్‌ సింగరాయ్‌'లో నటించనున్నారు. తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో పనర్జన్మల నేపథ్యం ఉంటుందట. హైదరాబాద్‌, కోల్‌కత్తా నేపథ్యాలతో రెండు ప్రేమకథలు ఉంటాయి. అందులో కోల్‌కత్తాలో సాగే ప్రేమకథకు లింక్‌గా హైదరాబాద్‌ ప్రేమకథ ఉంటుందని టాక్‌ వినిపిస్తోంది. సాయిపల్లవి, క్రితిశెట్టి ఇందులో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.  నాని తన కెరీర్‌లో తొలిసారి పునర్జన్మల నేపథ్యంలో చేయనున్నాడు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జె.మేయర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. 


Updated Date - 2020-10-28T23:24:28+05:30 IST