ఇక శ్రుతీ హాసన్‌ తర్వాత స్టెప్ అదేనా?

ABN , First Publish Date - 2020-02-08T03:27:12+05:30 IST

సినిమాలు, సంగీతం అయిపోయింది. ఇక రాజకీయాల మీద మనసు మళ్ళినట్టుంది శ్రుతీ హాసన్‌కు. తెలుగు, తమిళంతో పాటుగా

ఇక శ్రుతీ హాసన్‌ తర్వాత స్టెప్ అదేనా?

సినిమాలు, సంగీతం అయిపోయింది. ఇక రాజకీయాల మీద మనసు మళ్ళినట్టుంది శ్రుతీ హాసన్‌కు. తెలుగు, తమిళంతో పాటుగా బాలీవుడ్‌లో కూడా ఓ మెరుపు మెరిసిన ఈ భామ కొంతకాలం క్రితం సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చింది. ప్రేమా పెళ్ళి అంటూ తెగ హడావిడి చేసింది. ప్రేమ కథ కంచికి చేరడంతో ప్రస్తుతం సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళ సినిమా కథలు అయితే వింటోంది కానీ, ఏవీ ఆమెకు నచ్చడం లేదట. తెలుగులో ఓ సినిమాకి సైన్ చేసినా, ఇతర భాషల్లో మాత్రం ఈ భామ ఇంకా దేనికీ ఓకే చెప్పలేదని తెలుస్తుంది. 


ఎందుకలా అంటే.. గతంలోలాగా తనకు మంచి పేరు తెచ్చేకథలు రావడంలేదని తెగ బాధపడిపోతోందట కూడా. సినిమాల్లో తిరిగి పూర్వ వైభవం దక్కడం కష్టమన్న విషయం రుజువు కావడంతో రాజకీయాల మీద దృష్టి సారించిందట. తన తండ్రి పార్టీ మక్కల్ నీది మయ్యం ద్వారా రాజకీయ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

Updated Date - 2020-02-08T03:27:12+05:30 IST