అమితాబ్‌కి షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌..!

ABN , First Publish Date - 2020-10-14T21:45:42+05:30 IST

ఇప్పుడు టాలీవుడ్ రేంజ్ అంతా ప్యాన్ ఇండియా కోణంలో ఆలోచిస్తుంది. బడాస్టార్స్ అంద‌రూ వారి సినిమాల‌ను ప్యాన్ ఇండియా సినిమాలుగానే మ‌లిచే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

అమితాబ్‌కి షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌..!

ఇప్పుడు టాలీవుడ్ రేంజ్ అంతా ప్యాన్ ఇండియా కోణంలో ఆలోచిస్తుంది. బడాస్టార్స్ అంద‌రూ వారి సినిమాల‌ను ప్యాన్ ఇండియా సినిమాలుగానే మ‌లిచే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తెలుగు అనే కాదు.. సౌత్ సినిమాల‌న్నీ ప్యాన్ ఇండియా సినిమాలుగానే రూపొందుతున్నాయి. తెలుగు విష‌యానికి వ‌స్తే ‘బాహుబ‌లి’ త‌ర్వాత ప్యాన్ ఇండియా స్టార్‌గా సినిమాలు చేస్తున్న ప్ర‌భాస్ కిట్టీలో నాగ్ అశ్విన్ సినిమా ఒక‌టనే విష‌యం తెలిసిందే. ఈ సినిమాను ప్యాన్ ఇండియా కాదు.. వ‌రల్డ్ మూవీ అనేలా తెర‌కెక్కిస్తాన‌ని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ చెప్ప‌క‌నే చెప్పారు. ఆకోవ‌లో ఈ చిత్రంలో దీపికా ప‌దుకొనె స‌హా అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా న‌టించ‌డానికి రెడీ అయిపోయారు. కాగా.. తాజాగా సోష‌ల్ మీడియాలో ప్ర‌భాస్ చిత్రంలో న‌టించేందుకు అమితాబ్‌కు భారీ రెమ్యున‌రేష‌న్ ఇస్తున్న‌ట్లు వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. పాత్ర తీరు తెన్నుల‌ను వివ‌రిస్తూ బిగ్‌బికి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ మెయిల్ పంపార‌ట‌. ఆయ‌న‌కు కూడా పాత్ర న‌చ్చ‌డంతో ఓకే చెప్పేశార‌ట‌. ఈ పాత్ర చేస్తున్నందుకు అమితాబ్‌కు పాతిక కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌బోతున్నార‌ని టాక్‌. ఒక‌వేళ ఇది నిజ‌మే అయినా ఆశ్చ‌ర్య‌ప‌డ‌న‌క్క‌ర్లేదు. ఎందుకంటే, అమితాబ్‌, దీపిక‌ల‌ను బేస్ చేసుకుని బాలీవుడ్‌లో సినిమాకు మంచి మార్కెట్ పెరుగుతుంది. కాబ‌ట్టే మేక‌ర్స్ వారి రెమ్యున‌రేష‌న్స్ విష‌యంలో వెనుక‌డుగు వేయ‌లేద‌ని స‌మాచారం. 

Updated Date - 2020-10-14T21:45:42+05:30 IST