డెబ్యూ డైరెక్టర్‌కి ఓకే చెప్పిన శర్వానంద్‌..!

ABN , First Publish Date - 2020-10-30T21:07:48+05:30 IST

శర్వా సబ్జెక్ట్‌పై నమ్మకంతో కొత్త దర్శకులకు ఓ వైపు, సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్స్‌కు మరోవైపు ఓకే చెబుతూ వస్తున్నాడు. ఆ కోవలో ....

డెబ్యూ డైరెక్టర్‌కి ఓకే చెప్పిన శర్వానంద్‌..!

మంచి సక్సెస్‌ కోసం వేచి  చూస్తున్న యువ హీరోల్లో శర్వానంద్‌ ఒకడు. పడిపడిలేచెమనసు, రణరంగం, జాను సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద నిరాశపరిచినా.. శర్వా సబ్జెక్ట్‌పై నమ్మకంతో కొత్త దర్శకులకు ఓ వైపు, సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్స్‌కు మరోవైపు ఓకే చెబుతూ వస్తున్నాడు. ఆ కోవలో ప్రస్తుతం 'శ్రీకారం' సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న శర్వా తదుపరి కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో 'ఆడాళ్లు మీకు జోహార్లు' సినిమాలో నటించబోతున్నారు. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లకుండా ఈ హీరో మరో సినిమాను చేయడానికి ఓకే అన్నాడనే వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. వివరాల్లోకెళ్తే.. ప్రముఖ దర్శకడు దేవాకట్ట దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న శ్రీరామ్‌ చెప్పిన కథ నచ్చడంతో శర్వానంద్‌ అతనితో సినిమా చేయడానికి ఓకే చెప్పేశారట. ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్‌ ఈ సినిమాను నిర్మిస్తుంది. 


Updated Date - 2020-10-30T21:07:48+05:30 IST