డిఫరెంట్ పాత్రలో శర్వానంద్..?

ABN , First Publish Date - 2020-08-31T18:18:16+05:30 IST

డెబ్యూ డైరెక్ట‌ర్‌తో శ‌ర్వానంద్ ఓ సినిమా చేయ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ చిత్రంలో శ‌ర్వానంద్ ఓ విక‌లాంగుడి పాత్ర‌లో న‌టించ‌డానికి ఓకే చెప్పార‌ట‌.

డిఫరెంట్ పాత్రలో శర్వానంద్..?

‘జాను’ సినిమా తర్వాత ‘శ్రీకారం’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి సిద్ధ‌మ‌వుతోన్న క‌థానాయకుడు శ‌ర్వానంద్‌. ఇప్పుడున్న సినిమాలు కాకుండా ప్ర‌కాశ్ అనే డెబ్యూ డైరెక్ట‌ర్‌తో శ‌ర్వానంద్ ఓ సినిమా చేయ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ చిత్రంలో శ‌ర్వానంద్ ఓ విక‌లాంగుడి పాత్ర‌లో న‌టించ‌డానికి ఓకే చెప్పార‌ట‌. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇంటికే ప‌రిమిత‌మైన శ‌ర్వానంద్ త్వ‌ర‌లోనే ‘శ్రీకారం’ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇది పూర్తి చేసి అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో ‘మ‌హాసముద్రం’లో శ‌ర్వానంద్ నటించాల్సి ఉంది. 

Updated Date - 2020-08-31T18:18:16+05:30 IST